జాగ్రత్త.. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న యువజంట

ఎక్కువగా కష్టపడకుండా.. ఈజీ మనీ కోసం ఓ యువ జంట చైన్ స్నాచింగ్ ను తమ ఉపాధిగా ఎంచుకుంది. ఒంటరి మహిళే టార్గెట్ గా ఎంచుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. పక్కా ప్లాన్ తో బైక్ వచ్చి మహిళల మెడలోనుంచి బంగారాన్ని కొట్టేస్తున్నారు ఈ యువ జోడీ. ఈ క్రమంలోనే జనవరి 12వ తేదీ శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జంట చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. యారగండ్ల పల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత మెడలో నాలుగు తులాల చైన్ లాక్కొని దొరక్కుండా స్కూటీపై  పారిపోయారు. 

ఓ మహిళకు స్కూటీపై వచ్చి లిఫ్ట్  ఇచ్చి కొంత దూరం వెళ్లిన తర్వాత  ఆమె మెడపై ఉన్న నాలుగు తులాల బంగారం గొలుసును లాక్కొని మాల్ వైపు పారిపోయారు. స్థానికులు వెంబడించినా.. బైక్ పై తప్పించుకుని పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీ ఫుటేజ్ ద్వారా యువ జంటను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ డిఎస్పీ తెలిపారు.