వరంగల్ అర్బన్: తన ప్రేమను ఒప్పుకోవడంలేదని ఓ యువకుడు మైనర్ బాలికపై బీర్ సీసాతో దాడి చేశాడు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. వరంగల్ 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన బసికె నిఖిల్ 10వ డివిజన్ అబ్బనికుంట(టీఆర్‌టీ కాలనీ)కి చెందిన మైనర్ బాలికను వేధిస్తున్నాడు. కొంతకాలంగా తనను ప్రేమించాలని ఆమె వెంట పడుతుండగా బాలిక పట్టించుకోలేదు. యువకుడికి దూరంగా ఉండసాగింది. దీంతో కోపం పెంచుకున్న నిఖిల్ బుధవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవ రూ లేని సమయం చూసుకుని వెళ్లిన ఆయన.. బీరు సీసా పగలగొట్టి దానితో బాలికపై దాడి చేశాడు.
బాలిక తప్పించుకోవడంతో చేతిపై తీవ్రగాయాలయ్యాయి. ఆమె గట్టిగా అరవడంతో గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. ఆ తర్వాత బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు మిల్స్ కాలనీ పోలీసులు.