
- మద్యం మత్తులో దారుణం
మెదక్ (అల్లాదుర్గం), వెలుగు: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో సెల్ఫోన్ గుంజుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన చిన్నాన్నను కొట్టి చంపేశాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..గౌరగొల్ల మొగులయ్య, దుర్గయ్య, యాదయ్య (37)అన్నదమ్ములు. యాదయ్య భార్య వీణ భర్తతో గొడవ పడి కొన్నాళ్లుగా టేక్మాల్ మండలం కుసంగిలోని పుట్టింట్లో ఉంటోంది. యాదయ్య ఒంటరిగా ఉంటుండగా, మొగులయ్య కొడుకు 30 ఏండ్ల మహేశ్ తన చిన్నాన్న యాదయ్య తో కలిసి ఉండేవాడు. ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు.
బుధవారం రాత్రి వీరిద్దరు ఇంట్లో మద్యం సేవించారు. ఈ క్రమంలో యాదయ్య.. మహేశ్దగ్గర నుంచి సెల్ఫోన్ గుంజుకున్నాడు. కోపోద్రిక్తుడైన మహేశ్ కట్టెతో చిన్నా న్న యాదయ్యను ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే చనిపోయాడు. మెదక్ అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.