సూర్యపేటలో యువకుడి హత్య..ప్రేమ పెళ్లే కారణమా.?

 సూర్యపేటలో యువకుడి హత్య..ప్రేమ పెళ్లే కారణమా.?

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది.  మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.  జనగామ రహదారి నుంచి పిల్లల మర్రికి వెళ్లే  మూసి కెనాల్ కట్టపై మృతదేహం పడి ఉంది.

 స్థానికుల సమాచారంతో   ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బండ రాళ్లతో మోదీ హత్య చేసినట్లు గుర్తించారు. ఆరు నెలల కిందట కృష్ణ  ప్రేమ వివాహం చేసుకున్నాడని..  ప్రేమ పెళ్లే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :- బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ : హైదరాబాద్ లో డ్రగ్స్ బిజినెస్

ఆరు నెలల కిందే ప్రేమ పెళ్లి కావడంతో  కులాంతర వివాహమే కారణమా? లేక ఏవైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.  ఆరు నెలల కిందే పెళ్లి కావడంతో యువతి రోదిస్తుంది.