
ఎర్రుపాలెం, వెలుగు: తనకు న్యాయం చేయాలని ఓ బాలిక బంధువులతో కలిసి వాటర్‌ట్యాంక్ ఎక్కిన ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో జరిగింది. బాలిక బంధువులు ఎర్రుపాలెం పోలీస్ట్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన ముల్లంగి జమలయ్య(27) పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. అనంతరం పెండ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు.
బాలికకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఎర్రుపాలెం పీఎస్ వద్దకు వచ్చారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడి పరిస్థితి తనకు న్యాయం జరిగేలా లేదని భావించిన బాలిక చనిపోతానంటూ దగ్గరలోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు పోలీసులు నచ్చచెప్పి కిందకు దించారు.