ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళతో ఓ యువకుడు సహజీవనం చేసి, 25 తులాల బంగారంతో ఉడాయించాడు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరుకు చెందిన మహిళకు 2020లో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏపీలోని కడప జిల్లా చక్రాయపేట మండలం మహదేవపల్లికి చెందిన కొప్పర్తి మహేశ్వర్ రెడ్డి పరిచయమయ్యాడు. ఆ సమయంలో సదరు మహిళ కొంపల్లిలో నివాసం ఉండగా, ఆమె భర్త ఈ ఏడాది ఏప్రిల్ 4న చనిపోయాడు.
ఆ విషయం తెలుసుకున్న మహేశ్వర్రెడ్డి ఇన్సూరెన్స్, డెత్ సర్టిఫికెట్చేయిస్తానని ఆమెతో మాయమాటలు చెప్పాడు. అప్పటినుంచి అదే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశాడు. ఆగస్టులో ఆమె బొంగ్లూరులోని ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనగా, గృహప్రవేశానికి మహేశ్వర్రెడ్డి చెల్లి, తల్లిదండ్రులు వచ్చారు. తాను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అక్టోబర్వరకు అదే ప్లాట్లో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఏదైనా వ్యాపారం చేద్దామని చెప్పి బాధితురాలి నుంచి 25 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. అప్పటినుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితురాలు ఆదిబట్ల పీఎస్లో బుధవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.