వృద్ధుడి పెన్షన్​ పైసలు లూటీ చేసిన యువకుడు.. ప్రతి నెల ఖాతా నుంచి 20 వేలు డ్రా

వృద్ధుడి పెన్షన్​ పైసలు లూటీ చేసిన యువకుడు.. ప్రతి నెల ఖాతా నుంచి  20 వేలు డ్రా

హైదరాబాద్​: జగిత్యాలలో వృద్దుని బ్యాంక్​అకౌంట్​ నుంచి పెన్షన్​ డబ్బులను యువకుడు కాజేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.  జగిత్యాల గాంధీనగర్​కు చెందిన SRSP రిటైర్ట్ ​ఉద్యోగి లక్ష్మణ్​ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రిటైర్ట్​ ఉద్యోగి లక్ష్మణ్​కు ప్రతినెల రూ. 48 వేల పెన్షన్​ బ్యాంకులో జమ అవుతుంది.  ఆదే కాలనీకి చెందిన తిరుపతి అనే యువకుడు ఫోన్​నంబర్​ వృద్ధుని అకౌంట్​కి నమోదు చేసుకున్నాడు. తిరుపతి  ఫోన్​ఫో ద్వారా ఇప్పటివరకు రూ. 18 లక్షల డ్రా చేసుకున్నాడు.  ఏండ్ల నుంచి అనుమానం రాకుండా ప్రతినెల రూ. 20 వేల వృద్ధుడి అకౌంట్​నుంచి డ్రా చేసిన్నట్లుగా గుర్తించారు.  న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.