నిజామాబాద్ క్రైమ్, వెలుగు: భార్య కాపురానికి రాలేదని నిజామాబాద్ నగరంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఫోర్త్టౌన్ పోలీసుల కథనం ప్రకారం బోధన్ మండల కేంద్రానికి చెందిన షేక్ అఫ్రోజ్ నిజామాబాద్ నగరానికి చెందిన యువతిని పెండ్లాడాడు. నాలుగు నెలల కింద అఫ్రోజ్భార్య తల్లిగారి ఇంటికి వచ్చి, తెరిగి వెళ్లలేదు.
దీంతో తాగుడుకు బానిసైన అఫ్రోజ్ మధ్యం మత్తులో శనివారం ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్యానగర్ లో ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తన భార్య కాపురానికి రావడం లేదని, అప్పుల బాధ కూడా అధికమైందని అఫ్రోజ్ పేర్కొన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని సముదాయించి కిందికి దించారు.