పర్సు పోయిందని పోలీస్స్టేషన్​ పైకెక్కి హంగామా

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్ లో  పర్సు పోయిందని, దొరకకుంటే చస్తానంటూ ఓ యువకుడు ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి  హంగామా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన చింటూ అలియాస్  రాజు  శనివారం రాత్రి కరీంనగర్ ​బస్టాండ్‌‌కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు పర్సు దొంగిలించారు. రాత్రి నుంచి పోలీసులకు చెప్పినా పట్టించుకుంటలేరని పోలీస్​స్టేషన్ పైకి  ఎక్కి కూర్చున్నాడు.  పర్సు దొర‌‌కకుంటే దూకి చస్తానని బెదిరించాడు. ​సిబ్బంది అప్రమత్తమై రాజును కిందికి దింపే ప్రయత్నం  చేసినా వినకుండా ఆరగంట పాటు హంగామా చేశాడు. చివరికి అతన్ని మాటల్లో పెట్టి బిల్డింగ్‌‌పై నుంచి కిందికి దించారు. రాజు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.