
- హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందాడన్న డాక్టర్లు
- మేడ్చల్ జిల్లాలో ఘటన
కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసరలో క్రికెట్ఆడుతూ ఉన్నట్టుండి ఓ యువకుడు మృతి చెందాడు. ఓల్డ్ బోయినపల్లికి చెందిన ప్రణీత్ (32) కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడడానికి రాంపల్లి దయారాలోని త్యాగి స్పోర్ట్స్గ్రౌండ్ కు వెళ్లాడు.
క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కింద కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు బాధితుడిని సమీప హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండె పోటుతో చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రణీత్ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్‌గాంధీ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కెనరా బ్యాంక్‌లో పనిచేసిన ప్రణీత్ తండ్రి జగదీశ్ కొన్ని నెలల కిందటే చనిపోయాడు. ఇప్పుడు కొడుకు ఆకస్మిక మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.