
- ఖమ్మం జిల్లా కల్లూరులో ఘటన
కల్లూరు, వెలుగు: తనకు పెండ్లి కావడం లేదని మద్యానికి బానిసై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఖాన్ ఖాన్ పేట గ్రామం ఎస్టీ కాలనీలో బెజవాడ శ్రీనివాసరావు(26)అనే యువకుడు ఉంటున్నాడు.
కాలనీ సమీపంలోని హైవే పక్కనే ఉన్న చౌదరి హోటల్లో వర్కర్ గా పని చేస్తున్నాడు. సంబంధాలు చూస్తున్నప్పటికీ పెండ్లి కావడం లేదు. దీనికితోడు తన తోటి వారికి పెళ్లిళ్లు జరుగుతున్నాయనే డిప్రెషన్ లో మద్యానికి బానిసయ్యాడు. తాను ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సోదరి శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి హరిత తెలిపారు.