పెండ్లికి ఒప్పుకోలేదని యువకుడు​ సూసైడ్

పెండ్లికి ఒప్పుకోలేదని యువకుడు​ సూసైడ్
  • వరంగల్​ జిల్లా నెక్కొండ పట్టణంలో ఘటన

నెక్కొండ, వెలుగు: ప్రేమించిన యువతి కుటుంబసభ్యులు పెండ్లికి నిరాకరించడంతో యువకుడు​ సూసైడ్​  చేసుకున్నాడు. ఎస్సై మహేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​ జిల్లా నెక్కొండ పట్టణానికి చెందిన సదువాల శ్యాంకుమార్  ఉరఫ్​ అరుణ్(24)కు రెండేండ్ల కింద నర్సంపేటలో ఇంటర్​ చదివే సమయంలో మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడకు చెందిన ఓయువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 

కొన్ని నెలలుగా వరంగల్​లోని ఓ హోటల్​లో శ్యాంకుమార్​ కుక్​గా పని చేస్తున్నాడు.  యువతి కొత్తగూడలోనే ఉంటోంది. నెల రోజుల నుంచి పెండ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెండ్లికి యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల3న శ్యాం నెక్కొండలోని తన ఇంట్లో గడ్డిమందు తాగాడు. గమనించిన ప్యామిలీ మెంబర్స్  వరంగల్​లోని ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

మరో ఘటనలో..


ఘట్కేసర్: ప్రేమ విఫలమై మద్యానికి బానిసైన కొడుకును తల్లి మందలించడంతో ఉరేసుకొని పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడకు చెందిన బండారి సాయిప్రసాద్(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం ఐటీ కారిడార్  సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పేయింటర్  పని చేసే సాయిప్రసాద్​ గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుంచి మద్యం తాగి నిత్యం ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. శుక్రవారం రాత్రి తాగి ఇంటికి రాగా, తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.