ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కు అలవాటుపడి ఒకరు.. ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్య

ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కు అలవాటుపడి ఒకరు.. ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్య

కూసుమంచి, వెలుగు : ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగోళ్లపల్లి గ్రామానికి చెందిన కోరట్ల ఉపేందర్‌‌ (32)  ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కు అలవాటుపడ్డాడు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గేమ్స్‌‌ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్‌‌ గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అప్పయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

హైదరాబాద్‌‌ నార్సింగి పీఎస్‌‌ పరిధిలో...

గండిపేట, వెలుగు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి పెట్రోల్‌‌ పోసుకుని సూసైడ్‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో జరిగింది. లంగర్‌‌హౌజ్‌‌ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌‌ (40) ప్రైవేట్‌‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అప్పులు చేసి ఇల్లు కట్టాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మనస్తాపానికి గురైన మల్లికార్జున్‌‌ గురువారం గండిపేట వెళ్లి ఒంటిపై పెట్రోల్‌‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలను ఆర్పి, హాస్పిటల్‌‌కు తరలించారు. అప్పటికే 80 శాతం కాలిపోవడంతో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయాడు.