
గజ్వేల్, వెలుగు: ఉద్యోగం దక్కలేదని యువకుడు సూసైడ్చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్మండలం నెంటూరులో జరిగింది. ఎస్ఐ రవికాంత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నెంటూర్ గ్రామానికి చెందిన మాసన్ పల్లి అశోక్ (28) 2019 లో స్పోర్ట్స్ కోటాలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కోర్టుకు వెళ్లడంతో అశోక్ ఉద్యోగంలో చేరలేక పోయాడు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగంలో చేరలేక పోతున్నానన్న మనస్తాపంతో బుధవారం రాత్రి ఉరేసుకొని చనిపోయాడు. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.