ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు.. యువకుడు సూసైడ్

శంషాబాద్, వెలుగు: ఆన్​లైన్ యాప్​లో​ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేక సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..  సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ (23)  శంషాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఎయిర్ పోర్ట్ లోని సింధూర కంపెనీలో ఏసీ టెక్నీషియన్​గా పని చేస్తూ  ఆర్బీనగర్ లక్కీ డీలక్స్ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. కొద్ది నెలల  కింద ఓ యాప్​ నుంచి  లోన్  తీసుకున్నాడు. అయితే, లోన్​ చెల్లించేలక ఒత్తిడికి లోనై ఆదివారం హాస్టల్ లో పురుగుల మందు తాగాడు. అతడిని ఫ్రెండ్స్ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నారు.