కరీంనగర్ జిల్లాలో దారుణం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేదని కత్తితో యువతి గొంతు కోసి పారిపోయాడు యువకుడు.  కొత్తపల్లి మండల కేంద్రంలో ఈ ఘాతుకం జరిగింది. తీవ్ర గాయాల పాలైన యువతిని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు బంధువులు. బాధితురాలి గొంతు, చెవి దగ్గర తీవ్రంగా గాయాలయ్యాయి. 

కొత్తపల్లికి చెందిన ఆడెపు కావ్యశ్రీ (25) ఇంట్లో పరీక్షలకు ప్రీపేర్ అవుతుండగా.. ఇంట్లో చొరబడిన అదే గ్రామానికి చెందిన సాయికుమార్ కాశ్యశ్రీపై కత్తితో దాడి చేశారు. గత నాలుగేళ్లుగా సాయికుమార్ తనను ప్రేమించాలని వెంటపడి వేధిస్తున్నాడని బాధితురాలు కావ్యశ్రీ తెలిపింది. తాను నిరాకరించడంతో ఇంట్లో చదువుకుంటుండగా తనపై కత్తితో సాయికుమార్ దాడి చేశాడని పోలీసులు తెలిపింది.