సుల్తానాబాద్‌లో పెండ్లి కావడం లేదని యువకుడు సూసైడ్‌‌

సుల్తానాబాద్‌లో  పెండ్లి కావడం లేదని యువకుడు సూసైడ్‌‌

సుల్తానాబాద్, వెలుగు : పెండ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్‌‌ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన నల్ల లింగమూర్తి (38) పెద్దపల్లిలో ప్రైవేట్‌‌ జాబ్‌‌ చేస్తున్నాడు. ఇతడికి ఇంకా పెండ్లి కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గత నెల 29న రాత్రి తన ఇంట్లో ఎలుకల మందు తాగాడు. 

తీవ్రంగా కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా సుల్తానాబాద్ హాస్పిటల్‌‌కు, తర్వాత కరీంనగర్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ మంగళవారం చనిపోయాడు. మృతుడి సోదరుడు రాజేశం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.