
మనోహరాబాద్, వెలుగు : శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న యువకుడు ప్రమాదంలో చనిపోయాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఈనెల 12న అయ్యప్పమాల ధరించారు. అదేరోజు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు.
ఈ క్రమంలో కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు దగ్గర పాలసముద్రం వద్ద అతివేగంగా వచ్చిన బైకు యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివయాదవ్ (26) తీవ్రంగా గాయపడి చనిపోయాడు. తోటి భక్తులు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తెస్తున్నారు. యాక్సిడెంట్ పై కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు.