గ్రేటర్ వరంగల్, వెలుగు: జాతీయ జెండా చేతపట్టి గుర్రపు స్వారీ చేస్తూ.. గ్రేటర్ వరంగల్‍కు చెందిన యువకుడు వినూత్నంగా తన దేశభక్తిని చాటుకున్నాడు.
హనుమకొండ కేయూ జంక్షన్‍లోని ఫిట్‍నెస్ సెంటర్ నిర్వాహకుడు కొంతం సారంగం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆదివారం చేతిలో జాతీయ జెండా పట్టుకుని.. మరో చేతితో తెల్లని గుర్రాన్ని పరుగులు పెట్టిస్తూ జైహింద్ అంటూ నినాదాలు చేస్తూ ప్రయాణించాడు. కేయూ జంక్షన్, భీమారం, చింతగట్టు, పలివేల్పుల కాకతీయ కెనాల్ మీదుగా 5 కిలోమీటర్లు గుర్రపు స్వారీ చేస్తూ జనాలను ఆకట్టుకున్నాడు.