బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకుని యువకుడు సూసైడ్ 

బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకుని యువకుడు సూసైడ్ 
  •  గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

గద్వాల, వెలుగు: బెట్టింగ్ ల్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. గద్వాల టౌన్ కుమ్మరి వీధికి చెందిన శివ (20)  బెట్టింగ్ లకు బానిసగా మారాడు.  భారీగా డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా.. అప్పులు చేసి మళ్లీ బెట్టింగ్ ఆడాడు. ఫ్రెండ్స్ వద్ద రెండు కార్లు తీసుకెళ్లి కొత్తకోటలో తాకట్టు పెట్టి.. వచ్చిన డబ్బులను కూడా బెట్టింగ్ లో  కోల్పోయాడు. అప్పులోళ్లు  ఒత్తిడి చేస్తుండగా  సోమవారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది వరకు చేసిన  అప్పులను  తండ్రి చెల్లించాడు. మళ్లీ అప్పులు చేయగా తీర్చేమార్గం లేక చనిపోయినట్టు తెలుస్తుంది. ఎలాంటి ఫిర్యాదు అందలేదని టౌన్ ఎస్ఐ కళ్యాణ్ తెలిపారు.