రామకృష్ణాపూర్​లో పెండ్లి చేసుకుంటే పోషించలేమోనని యువకుడు ఆత్మహత్య

రామకృష్ణాపూర్​లో పెండ్లి చేసుకుంటే పోషించలేమోనని యువకుడు ఆత్మహత్య
  •  మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో విషాదం

కోల్ బెల్ట్​,వెలుగు: జాబ్ లేకుండా ప్రేమ పెండ్లి చేసుకుంటే పోషించలేమోనని మనస్తాపానికి లోనైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. రామకృష్ణాపూర్​టౌన్​ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు మండలం గంగరాం గ్రామానికి చెందిన బొమ్మన సంతోషిణి కొడుకు వినయ్​రెడ్డి(20), రామకృష్ణాపూర్​టౌన్ అబ్రహంనగర్​లో తాత లింగారెడ్డి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు.

క్యాటరింగ్​పనులకు కూడా వెళ్తుంటాడు. కొన్నాళ్లుగా అదే ఏరియాకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండడంతో యువకుడు తమ కుటుంబసభ్యులకు తెలిపాడు. జాబ్ లేకపోవడంతో పెండ్లి చేసుకుంటే ఎట్లా పోషించాలని మనస్తాపానికి లోనైన వినయ్​శనివారం ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి తల్లి సంతోషిణి  ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.