మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. బెల్లంపల్లి పట్టణం బుడిదిగడ్డ బస్తీలో అన్న రాజ్ కుమార్, ఇద్దరు పిల్లలను కాపాడబోయిన తమ్ముడు శరత్ కుమార్ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. తమను కాపాడబోయి తమ్ముడు ప్రాణాలు అర్పించడంతో అన్న రాజ్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఏం జరిగిందటే..
ఓ ఆటోలో రాజ్ కుమార్ అతని ఇద్దరు పిల్లలు వెలుతున్నారు. ఈ సమయంలో అతివేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను ఈడ్చూకుంటూ వెళ్లింది. అయితే ఈ విద్యుత్ వైర్లు పక్కనే వస్తున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ఉన్న వారికి కరెంట్ షాక్ తగిలింది. వారిని కాపాడేందుకు శరత్ కుమార్ ప్రయత్నంచాడు. ఆటోలో నుంచి అన్న రాజ్ కుమార్, ఇద్దరు పిల్లలను కిందకు తోసేసి వారిని కాపాడాడు. కానీ శరత్ కుమార్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.
తీవ్ర గాయాలపాలైన శరత్ కుమార్ ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తలించారు. అతనికి పరీక్షించిన వైద్యులు.. శరత్ కుమార్ అప్పటికే చనిపోయాడని నిర్థారించారు. దీంతో శరత్ కుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.