సిద్దిపేట జిల్లా.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి

సిద్దిపేట జిల్లా.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి

సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.  జెండా ఆవిష్కరిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

మృతుడిని లింగ ప్రసాద్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. వీరిలో వడ్డె కరుణాకర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా తెలుస్తోంది.