
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు చికిత్స కోసం యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని మిర్యాలగూడ బంగారుగడ్డకు చెందిన గుంటోజు మధుగా గుర్తించారు.
ఆస్తి తగాదా విషయంలో ఫిర్యాదు చేసేందుకు గుంటోజు మధు పోలీస్ స్టేషన్ రాగా..మధు మద్యం ఉండటంతో రేపు రావాలని పోలీసులు నచ్చజెప్పారు. అయితే అప్పటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని స్టేషన్ బయట నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్సకోసం మధును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మద్యం మత్తులో తల్లిని, కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని పోలీసులకు కుటుంబ సభ్యులు చెప్పారు.