తెలంగాణలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు భర్తీ చేయక.. ఉన్న ఉద్యోగాలు రాక.. తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కొందరు ఆవేదనతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ నిరుద్యోగి తన తండ్రి ఉద్యోగం కూడా తనకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదనతో రోడ్డెక్కాడు. అర్థనగ్న ప్రదర్శనకు దిగాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. కల్వచర్ల గ్రామానికి చెందిన ఒర్రె సాయితేజ తండ్రి ఉద్యోగం కోసం రెండేళ్లుగా తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. డబ్బులు ఖర్చు చేసి అప్పులపాలయ్యామని తీవ్ర ఆవేదనతో అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. రహదారిపై షర్ట్ లేకుండా.. పుస్తకాలు చేత పట్టుకొని పరుగులు తీశాడు. సాయితేజ తండ్రి ఒర్రె పర్వతాలు సింగరేణి ఉద్యోగం చేస్తూ హార్ట్ ఎటాక్ తో మరణించారు. అయితే అప్పటి నుంచి తండ్రి ఉద్యోగం కోసం సాయితేజ అప్పులు చేసి మరి ప్రయత్నించాడు. తమ గోడును అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు ఆందోళనకు దిగాడు.
ఇవి కూడా చదవండి: