స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని.. ఓలా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిప్పుపెట్టిండు

స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని.. ఓలా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిప్పుపెట్టిండు
  • కర్నాటకలోని కలబురగిలో ఘటన

బెంగళూరు: తన ఎలక్ట్రిక్ -స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సర్వీసింగ్ చేయలేదని ఓ యువకుడు ఓలా షోరూమునే తగలబెట్టాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. మెకానిక్ అయిన మహ్మద్ నదీమ్(26).. గత నెల 28న రూ.1.4 లక్షలతో  ఓలా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొన్నాడు. 

రెండు రోజులకే అందులోని బ్యాటరీ, సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్య వచ్చింది. రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అతను తన బైక్ ను ఓలా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాడు. అయితే, 10 రోజులు గడిచినా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది నదీమ్ కొత్త స్కూటీని రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. దాంతో అతనికి ఒళ్లు మండింది. మంగళవారం రాత్రి పెట్రోల్ తీసుకువెళ్లి షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోసి నిప్పంటించాడు. 

Also Read:-హేమ డ్రగ్స్ తీసుకుంది

దాంతో షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కంప్యూటర్లు, 6 స్కూటర్లు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, రూ.8.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.