సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం చేస్తుండగా చూసి సాక్ష్యం చెప్పాడని బాలుడిని హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జోగి పేటలో జరిగింది. జోగిపేటకు చెందిన నాగరాజు అనే యువకుడు దొంగతనం చేస్తుండగా శేఖర్ అనే బాలుడు చూసి సాక్ష్యం చెప్పాడు..దీంతో శేఖర్ పై కక్షపెంచు కున్న నాగరాజు శనివారం (ఏప్రిల్ 20) రాత్రి శేఖర్ ను చంపాడు.
అనంతరం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. టవర్ పై నుంచి కిందికి దించేందుకు యత్నించిన వారిపై కత్తితో దాడిచేశాడు.బాలుడు శేఖర్ను తాను హత్య చేశానని చెప్పిన నాగరాజు. అనంతరం టవర్ పైనే కేబుల్ కట్ చేసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని బంధువులు ఆందోళన దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడు శేఖర్ మృతదేహం ఇంకా దొరకలేదు.