
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ళ సాయి కుమార్ గౌడ్ (17) అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు.
అయితే యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యువతి తండ్రే ఈ హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి..సాయి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వీళ్ల ప్రేమకు ఒప్పుకోని యువతి తండ్రే పక్కా ప్లాన్ ప్రకారం సాయిని హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.