పాక్ క్రికెటర్ తో ప్రేమలో పడిన యంగ్ మోడల్.. కానీ పెళ్ళి తర్వాతే అది ఉంటుందంటూ..

పాక్ క్రికెటర్ తో ప్రేమలో పడిన యంగ్ మోడల్.. కానీ పెళ్ళి తర్వాతే అది ఉంటుందంటూ..

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ గురించి క్రికెట్ ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాబర్ ఆజామ్ ని పాకిస్తాన్ విరాట్ కోహ్లీ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం బాబర్ ఆజామ్ న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ట్రై సీరీస్ లో పాకిస్దాన్మ్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

అయితే బాబర్ ఆజామ్ ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బాబర్ ఆజామ్ పాకిస్తాన్ కి చెందిన మోడల్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దువా జహ్రాతో ప్రేమలో పడ్డాడని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో దువా జహ్రా ఈ విషయంపై స్పందిస్తూ బాబర్ ఆజామ్ పై ప్రేమ, అభిమానం గురించి మాట్లాడింది. ఇందులో భాగంగా తనకి బాబర్ ఆజామ్ అంటే తనకి అమితమైన అభిమానం, ప్రేమ ఉందని స్పష్టం చేసింది. కానీ తనకి పెళ్ళికి ముందు కలసి ఉండటం, డేటింగ్ చేయడం వంటివాటిపై నమ్మకం లేదని  చెప్పుకొచ్చింది. అయితే వివాహం బంధంలోనే నిజమైన ప్రేమ ఉంటుందని, అలాగే ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. బాబర్ ఆజామ్ ని సోషల్ మీడియాలో నెటిజటివ్ గా ట్రోల్ చేసినా.. విమర్శలు చేసినా తట్టుకోలేనని కాబట్టి దయచేసి ఆపాలని కోరింది. వీటినన్నిటిని బట్టి చూస్తే దువా జహ్రా వన్ సైడ్ లవ్ అని తెలుస్తోంది.

దువా జహ్రా ఎవరనే విషయానికొస్తే మోడలింగ్ రంగంలో పని చేస్తూ బాగానే రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా తరచుగా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 3 లక్షల పైచిలుకు ఫాలోవర్లు ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య దువా జహ్రా సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం.

ఇక బాబర్ ప్రేమాయణం విషయంలో పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ నటి హానీయా అమీర్ తో ప్రేమలో పడినట్లు గతంలో పలు రూమర్స్ వినిపించాయి. అంతేకాదు కొంతకాలం పాటూ ఈ ఇద్దరూ కలసి డేటింగ్ లో కూడా ఉన్నారని ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ పెద్దలు అంగీకరించకపోవడంతో విడి పోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఈ రూమర్స్ పై బాబర్ ఆజామ్ లేదా హానీయా అమీర్ స్పందించలేదు.