కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. వయసుతో సంబంధం లేకుండా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తమిళ యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్(28) ఈరోజు (మే 2) ఉదయం 6:30 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన నిన్న(మే 1) ఒమండూరు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 6.30 గంటలకు మృతి చెందాడు.
చాలా చిన్న వయస్సులోనే సంగీత స్వరకర్తగా రాణిస్తున్న ప్రవీణ్ కుమార్ మృతి చెందడం పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురి చేసింది.ప్రవీణ్ రాకథాన్,మెడకు, మెడకు 2, కక్కన్, బంపర్, రాయర్ పరంపరై వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
మరో ప్రముఖ గాయని ఉమా రమణన్ (Uma Ramanan) అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి (మే 1) కన్నుమూశారు. ఆమె వయసు 72. ప్రముఖ గాయని మరణంతో అభిమానులు షాక్‌లో ఉండగానే..ఈ 28 ఏళ్ల స్వరకర్త ఊహించని మరణంతో కోలీవుడ్ ను మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది.
24 గంటల్లో కోలీవుడ్‌లో ఇద్దరు మృతి చెందడం అభిమానులను విషాదంలో ముంచెత్తగా..అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.