
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో శుక్రవారం కొంతమంది యువకులు పాలస్తీనా జెండాను ప్రదర్శించారు. రెడ్డి కాలనీలోని బ్లూ వేల్ ప్యాలెస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వన్ టౌన్ పోలీసులు ఆ యువకులను స్టేషన్ కు తరలించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశామని వన్ టౌన్ సీఐ రాఘవేందర్ తెలిపారు.