
చేర్యాల, వెలుగు: యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో చేర్యాల ప్రాంతానికి చెందిన యువకులు ఎన్నికయ్యారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని చిట్యాలకు చెందిన బందిగ రాకేశ్ కృష్ణన్, జనగామ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొత్త దొమ్మాటకు చెందిన కర్క సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షుడిగా ఆకునూరుకు చెందిన భూమని బాల్‌రాజు జనగామ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ధూల్మిట్ట మండలంలోని జాలపల్లికి చెందిన చెట్కూరి కమలాకర్‌యాదవ్, ధూల్మిట్ట, మద్దూరు మండలాలకు ధరావత్ సుమన్, బియ్య మహేశ్ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన యూత్నాయకులను జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, మ్యాక మల్లేశం, కోల సాయిలు గౌడ్అభినందించారు.