క్యాన్సర్ బారిన పడి తెలుగు యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ మృతి

క్యాన్సర్ బారిన పడి తెలుగు యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ మృతి

క్యాన్సర్ మహమ్మారికి ఒక పరిశోధక విద్యార్థి బలయ్యాడు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న అజయ్ హార్ధిక్ అలియాస్ సామేలు (39) మృతి చెందడం విషాదం మిగిల్చింది. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న అజయ్ శనివారం (మార్చి1) మృతి చెందాడు. 

అజయ్ తెలుగు విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రం (లింగ్విస్టిక్స్)లో పీహెచ్ డీ చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయగ్గారి పల్లి గ్రామానికి చెందిన అజయ్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. శనివారం తన స్వగ్రామంలో కన్నుమూశాడు. 

అజయ్ కి భార్య నిఖిత (34) తో 2016లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు అను నిహారిక (7) , నితిన్ రైన్ చంద్ (5)  లు ఉన్నారు. తల్లిదండ్రులు గత పదేళ్ల క్రితమే చనిపోయారని సన్నిహితులు తెలిపారు. ప్రభుత్వం, దాతలు ఎవరైనా సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, మిత్ర బృందం కోరుతున్నారు.