- లోబర్చుకుని మోసగించాడంటున్న బాధితురాలు
- మంచిర్యాల జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఘటన
బెల్లంపల్లి రూరల్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ఓ గిరిజన యువతి న్యాయ పోరాటానికి దిగింది. అతడు పెండ్లి చేసుకునేదాకా కదిలేది లేదని బైఠాయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. బాధిత యువతి తెలిపిన ప్రకారం.. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన జంబి అంజలి, అదే మండలం గొల్లపల్లికి చెందిన రేచవేణి రాజశేఖర్ రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజశేఖర్ తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడని , పెండ్లి చేసుకుందామనడంతో నిరాకరించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ ప్రియుడి ఇంటి ముందు ఆదివారం కూర్చుని నిరసనకు దిగింది. అంజలి బైఠాయించడంతో రాజశేఖర్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తన ప్రియుడితో పెళ్లి చేయించాలని గ్రామస్తులను యువతి కోరింది.