మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. యువతిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు నిందితులు. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతురాలు ఎవరు..? ఇక్కడకి ఎలా వచ్చింది..? ఎవరితో వచ్చింది..? అన్న విషయాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే.. మేడ్చల్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ | అనంతపురం: నేషనల్ హైవేకు దగ్గరగా భారీ చోరీ.. రూ. 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. నగదు దోపిడి
ఇటీవల రాష్ట్ర రాజధాని హైరదాబాద్‌లో చోటు చేసుకుంటున్న వరుస హత్యలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు వారాల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జరిగిన డబుల్ మర్డర్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మురుకవముందే.. తాజాగా మీర్పేట్లో ఒళ్లు గగుర్పొడిచే హత్య జరిగింది.
అనుమానంతో ఓ మాజీ ఆర్మీ జవాన్ భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. చంపిన అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రెజర్ కుక్కర్ లో ఉడకబెట్టాడు. అనంతరం ఆ శరీర భాగాలను ఎండబెట్టి పొడిగా మార్చి దగ్గర్లోని చెరువులో పడేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే.. తాజాగా మేడ్చల్‌లో యువతి దారుణ హత్యకు గురి కావడం గమనార్హం.