యంగ్ CA యువతి.. ఆఫీస్ పని ఒత్తిడికి ఆత్మహత్య : గుండెలు పిండేస్తున్న తల్లి లేఖ

యంగ్ CA యువతి.. ఆఫీస్ పని ఒత్తిడికి ఆత్మహత్య : గుండెలు పిండేస్తున్న తల్లి లేఖ

పేరు అన్నా సెబాస్టియన్ పెరియల్.. రాష్ట్రం కేరళ.. వయస్సు 26 ఏళ్లు మాత్రమే.. ఇంకా పెళ్లి కాలేదు.. కష్టపడి చదువుకుని సీఏ.. చార్టెర్డ్ అకౌంటెంట్ అయ్యింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా.. పూణెలోని ఓ బడా కంపెనీలో సీఏగా అవకాశం వచ్చింది. కేరళ నుంచి ఫ్యామిలీతో పూణె షిఫ్ట్ అయ్యింది. ఆ ఉద్యోగమే ఆ యువతికి శాపం అయ్యింది.. బలి తీసుకున్నది అనేది అన్నా సెబాస్టియన్ తల్లి చెబుతున్న లేఖ.. పూర్తి వరాల్లోకి వెళితే..

యంగ్ సీఏగా ఉద్యోగంలో చేరిన అన్నా సెబాస్టియన్ పని ఒత్తిడిని ఎదుర్కొంంది. సరైన తిండి లేదు.. సరైన నిద్ర లేదు. ఆఫీస్ వర్క్ చేయటానికే 24 గంటల సమయం సరిపోయేది కాదంట.. ఎప్పుడూ ఆఫీసులోనే ఎక్కువ సమయం ఉండేదంట.. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి ఇదే పరిస్థితి అని ఆ యువతి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఒక్క నా కూమార్తె విషయంలోనే కాదు.. ఆ ఆఫీసులోని చాలా మంది పని ఒత్తిడి వల్లే రాజీనామా చేసి వెళ్లిపోతున్నట్లు తన కుమార్తె చెప్పినట్లు వెల్లడించింది. నువ్వు కూడా ఉద్యోగం మానేయ్ అని నేను ఎన్నోసార్లు చెప్పినా.. కష్టపడి చదవి.. సాధించుకున్న ఉద్యోగం.. పట్టుదలతోనే విజయం వస్తుందని.. తనకు తాను సర్దిచెప్పుకుందని వివరించింది ఆ తల్లి. అయితే ఇంత తీవ్రమైన ఒత్తిడి, పని భారంతో మానసికంగా.. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుందని.. ఆత్మహత్య చేసుకునేంతగా టెన్షన్ ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయాం అంటూ కన్నీటి పర్యంతంతో తన లేఖలో స్పష్టం చేసింది ఆ తల్లి. 

అర్థరాత్రులు ఫోన్ చేసి.. రేపటి వర్క్ ఇచ్చేవారని.. ఆఫీసుకు వచ్చే సమయానికి పూర్తి కావాలని మేనేజర్లు చాలా సార్లు ఫోన్ చేసినట్లు స్పష్టం చేసింది ఆ తల్లి. 

ఉద్యోగి చనిపోతే కనీసం చూడటానికి ఆఫీసు నుంచి ఎవరూ రాలేదని.. సమాచారం ఇచ్చినా అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదని ఆ తల్లి వివరించింది. అంతేనా.. అంత్యక్రియల తర్వాత కుమార్తె మరణాన్ని ఆఫీసుకు సమాచారం ఇచ్చినా.. ఎలాంటి రిప్లయ్ లేదని స్పష్టం చేసింది ఆ తల్లి. విలువలు, మానవత్వం అంటూ చెప్పుకొచ్చే కార్పొరేట్ సంస్థలు.. అందులో పని చేసే ఉద్యోగులు ఎలాంటి ఆలోచనలు, పరిస్థితుల్లో ఉన్నారు.. ఎలా వ్యవహరిస్తారు అనటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు అంటూ ఆ తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది. 

26 ఏళ్ల యంగ్ సీఏ అన్నా సెబాస్టియన్.. 2024, జూలై 20వ తేదీన ఆత్మహత్య చేసుకున్నది. ఆ యువతి తల్లి పేరు అనిత అగస్టీన్. ఆ యువతి పని చేస్తున్న సంస్థ పేరు EY పూణె కంపెనీ. జాయిన్ అయిన తేదీ 2024, మార్చి 19వ తేదీ.