గోదావరిఖనిలో ఉద్యోగం రావడం లేదని యువతి ఆత్మహత్య

గోదావరిఖనిలో ఉద్యోగం రావడం లేదని యువతి ఆత్మహత్య
  • పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన

గోదావరిఖని, వెలుగు: కాంపిటీటివ్​ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్​హౌస్​ కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(25) ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖని వన్​టౌన్​ ఎస్సై భూమేశ్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని బస్టాండ్  ఏరియా వద్ద హోటల్​ నిర్వహించే విఠల్​కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రత్యూష చిన్న కూతురు కాగా, పీజీ వరకు చదివిన ఆమె గవర్నమెంట్​ ఉద్యోగాలతో పాటు బ్యాంక్​ జాబ్​ కోసం పలుమార్లు పరీక్షలు రాసింది.

ఉద్యోగాలు రాకపోవడంతో మానసికంగా కుంగిపోయిన ప్రత్యూష మంగళవారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను గోదావరిఖని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి తండ్రి విఠల్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యూష కండ్లను సదాశయ ఫౌండేషన్  ద్వారా సేకరించి ఎల్వీ​ ప్రసాద్​ కంటి ఆసుపత్రికి తరలించారు.