- నలుగురు నిందితులు అరెస్ట్
మియాపూర్, వెలుగు : తోటి సెక్యూరిటీ గార్డులు వేధింపులకు గురిచేయడంతో ఒడిశాకు చెందిన ఓ యువతి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వేధింపుల విషయం బయటపడింది. ఒడిశాలోని సోమనాథ్పూర్గ్రామానికి చెందిన రాజానిమణి బెహ్రా కూతురు గీతాంజలి(21), ఝార్ఖండ్రాష్ట్రానికి చెందిన ఆశిష్ కుమార్(21), గౌతమ్‌కుమార్(21), శంకర్ఠాకూర్(21), మిథున్‌కుమార్(30) కొంత కాలంగా మియాపూర్ మయూరినగర్‌లోని కోరుకొండ కోచింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.
గీతాంజలి ఇనిస్టిట్యూట్‌లోని ఓ రూమ్‌లో ఉంటోంది. అయితే ఈ నెల 8న అర్ధరాత్రి తర్వాత గీతాంజలి కోచింగ్సెంటర్సెక్యూరిటీ రూమ్‌లో టవల్‌తో ఉరివేసుకుంది. మియాపూర్పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒడిశా నుంచి సిటీకి వచ్చిన గీతాంజల్లి తల్లిదండ్రులు తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తోటి సెక్యూరిటీ గార్డులు రేప్‌చేసి చంపేశారని ఆరోపించారు. విచారణలో ఆశిష్‌కుమార్, గౌతమ్‌కుమార్, శంకర్ఠాకూర్, మిథున్‌కుమార్ గీతాంజలితో అసభ్యకరంగా ప్రవర్తించారని, వారి వేధింపులు తట్టుకోలేక సూసైడ్చేసుకుందని పోలీసులు గుర్తించారు. సోమవారం నిందితులు నలుగురిని అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించారు.