- నిందితుడు బీఆర్‌ఎస్ బెల్లంపల్లి నియోజవర్గ అధ్యక్షుడు శ్రీనాథ్‌పై కేసు నమోదు
బెల్లంపల్లి, వెలుగు : ప్రేమించిన యువకుడు పెండ్లి చేసుకుంటానని మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం జరిగింది. బెల్లంపల్లి వన్ టౌన్ ఏఎస్సై నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగేపల్లి స్నేహిత (21), మహ్మద్ ఖాసీం బస్తీకి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
శ్రీనాథ్ పెండ్లి చేసుకోకుండా స్నేహితను మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.