కేపీహెచ్‎బీ లేడీస్ హాస్టల్‎లో యువతి ఆత్మహత్య

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేపీహెచ్‎బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‎బీ రోడ్డు నెంబర్ 3లోని ఓ లేడీస్ హాస్టల్‎లో ఉంటున్న స్నేహ(34)  ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే, గతంలో రెండు వివాహాలు చేసుకోగా అవి విడిపోవడంతో ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ఉంటున్న స్నేహ.. జీవితంపై విరక్తి చెంది ఇవాళ (సెప్టెంబర్ 20) హాస్టల్‎లో ఆత్మహత్య చేసుకుంది. 

గమనించిన హాస్టల్ నిర్వాహకులు మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్‎కు చేరుకున్న పోలీసులకు ఘటన స్థలంలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ‘‘గత 17 సంవత్సరాలుగా తను చనిపోవాలని అనుకుంటున్నా.. నా చావుకు ఎవరు కారణం కాదు’’ అని సూసైడ్ నోట్ రాసి స్నేహ ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహ తండ్రి ఆకుల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.