మంచిర్యాల, వెలుగు: టీవీ, సెల్‌ఫోన్ చూడడం తగ్గించి బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువతి సూసైడ్చేసుకుంది. హాజీపూర్ మండలం నర్సింగపూర్ కు చెందిన బైకం కీర్తన(18) మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. కీర్తన కొద్ది రోజులుగా టీవీ చూస్తూ, సెల్ ఫోన్‌తో గడుపుతోంది. వాటిని బంద్‌పెట్టి చదువుకోవాలని మంగళవారం కుటుంబసభ్యులు మందలించారు.
దీంతో ఆమె ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన వారు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్సై నరేశ్ తెలిపారు.