![ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌లో తెలంగాణ యువతి](https://static.v6velugu.com/uploads/2021/02/football.jpg)
విమెన్స్ నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌కు సెలెక్టయిన సౌమ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువ ప్లేయర్ గుగులోత్ సౌమ్య ఇండియా విమెన్స్ నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌కు సెలెక్ట్ అయింది. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకూ జరిగే టర్కీ టూర్‌లో పోటీ పడే సీనియర్ టీమ్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. 19 ఏళ్ల ఈ యంగ్ ఫార్వర్డ్ సౌమ్య ప్రస్తుతం గోవాలో నేషనల్ క్యాంప్‌లో ట్రెయినింగ్ తీసుకుంటోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన సౌమ్య అతి తక్కువ టైమ్‌లోనే ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా ఎదిగింది. కోచ్ నాగరాజు మార్గనిర్దేశంలో జిల్లా, స్టేట్ దాటి నేషనల్ లెవెల్లో అదరగొడుతోంది. 2015లో ఖట్మాండులో జరిగిన ఏఎఫ్‌సీ టోర్నీలో ఇండియా అండర్–14 గర్ల్స్ టీమ్ తరఫున బరిలోకి దిగింది. ఆపై, 2018లో సౌతాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ టోర్నీలో పోటీ పడ్డ ఇండియా అండర్–17 టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది. గ్రౌండ్‌లో మెరుపు వేగంతో రన్నింగ్ చేసే ఈ యంగ్‌స్టర్ పలు లీగ్స్‌లోనూ అద్భుత పెర్ఫామెన్స్ చేసింది. ఇండియన్ విమెన్స్‌లీగ్ రెండు సీజన్లలో సత్తా చాటి నేషనల్ సెలెకర్లను మెప్పించింది. దాంతో, నేషనల్ టీమ్‌కు ఆడాలన్న తన నెరవేర్చుకుంది.
For More News..