వారాసిగూడలో యువతి మిస్సింగ్

వారాసిగూడలో యువతి మిస్సింగ్

పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి కనిపించకుండా పోయింది. ఎస్సై సునీత కథనం ప్రకారం.. బౌద్ధనగర్ కు చెందిన వసంత, శేఖర్ దంపతుల కూతురు పి.స్వప్న(19) నామాలగుండులోని ఓ సూపర్​ మార్కెట్ లో పనిచేస్తుంది. సోమవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లిన స్వప్న రాత్రికి తిరిగి రాలే దు. కుటుంబ సభ్యులు సూపర్ మార్కెట్లో ఆరా తీయగా, డ్యూటీకే వెళ్లలేదని తెలిసింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో వారాసిగూడ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్​కేసు నమోదు చేశారు.