ప్రేమించిన యువతికి మరో పెండ్లి..యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌

  • ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పరిచయం అయిన యువతి

నెక్కొండ, వెలుగు : ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌‌‌‌‌‌‌‌రావుపేట గ్రామానికి చెందిన జిల్లా వినయ్‌‌‌‌‌‌‌‌ (25) కొన్నేండ్లుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ ఫుడ్‌‌‌‌‌‌‌‌ డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ఏపీలోని తిరుపతికి చెందిన ఓ యువతి పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో యువతి కొన్ని రోజుల కింద హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఇక్కడే ఉంటోంది. 

వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వచ్చి యువతిని తిరుపతికి తీసుకెళ్లారు. అనంతరం వేరే యువకుడితో పెండ్లి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ గత నెల 25న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శనివారం రాత్రి చనిపోయాడు.