పెండ్లిపై భయం పెంచుకుని యువతి సూసైడ్

మూసాపేట,వెలుగు: పెండ్లిపై భయం పెంచుకున్న ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి పీఎస్ పరిధి మూసాపేటలోని చైతన్యబస్తీలో ఉండే ఝాన్సీ (25) ప్రైవేటు జాబ్ చేస్తుండేది. కొంతకాలంగా ఝాన్సీకి కుటుంబసభ్యులు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు.

చుట్టుపక్కల ఇండ్లల్లో భార్యభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలు చూసిన ఝాన్సీ పెండ్లిపై భయం, విరక్తి పెంచుకుంది. తాను పెండ్లి చేసుకోనని కుటుంబసభ్యులకు తెగేసి చెప్పింది. అయినా ఆమెకు  సంబంధాలు చూడ టం ఆపలేదు. దీంతో తనకు ఎక్కడ పెండ్లి చేస్తారోనని భయపడిన ఆమె శుక్రవారం ఉదయం రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.