హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైంది. ఎస్సై జహంగీర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సోమవరపు ఇందు( 19) ఈనెల 23వ తేదీన సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది.
తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి సోమవరపు వెంకట చారి బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో గురువారం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.