ఏం కష్టమొచ్చిందో..ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

ఏం కష్టమొచ్చిందో..ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

ముషీరాబాద్, వెలుగు: ఐదో అంతస్తు నుంచి దూకి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. రాంనగర్ డివిజన్ హరినగర్​కు చెందిన ముజామిల్ బేగ్ కుమార్తె సన బేగం(26) భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. 

శనివారం మధ్యాహ్నం వీఎస్​టీ మార్గంలో ఉన్న గిరిశిఖర అపార్ట్​మెంట్​మొదటి అంతస్తులో ఉన్న బ్యాంక్​కు వెళ్లింది. అక్కడ పైన ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్​లో తమకు తెలిసినవారు ఉన్నారని చెప్పి ఐదో అంతస్తుకు చేరుకుంది. 

ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు కింద నుంచి ఎవరని అరుస్తుండగానే ఆమె ఒక్కసారిగా కిందకు దూకింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. చిక్కడపల్లి సీఐ సీతయ్య క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 సనబేగం ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.