- ఆఫీస్ సిమ్ అప్పజెప్పి లీవ్‌లో వెళ్లిన ఎస్ఐ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ డివిజన్పరిధిలోని ఓ యువతి స్టేషన్లో బైటాయించిన ఘటన జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. యువతిని స్టేషన్‌లోని సిబ్బంది సముదాయించి పంపగా, అదే అదునుగా భావించిన ఎస్ఐ ఆఫీస్ సిమ్ కార్డును ఠాణాలో అప్పగించి సోమవారం సడన్ లీవ్‌లో వెళ్లారు.
పెండ్లి పేరుతో మోసం చేసిన అతడికి ఇదివరకే భార్యాపిల్లలు ఉన్నారని తెలిసిన యువతి, ఆదివారం రాత్రి అతడు పనిచేస్తున్న ఠాణాకు వచ్చి కూర్చుంది. న్యాయం కావాలని పట్టుబట్టిన ఆమెను స్టేషన్సిబ్బంది ఉదయం మాట్లాడదామని చెప్పి పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ యువతికి దొరకొద్దనే ఆలోచనతో సడన్ లీవ్‌లో వెళ్లిపోయారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కల్మేశ్వర్ విచారణకు ఆదేశించారు.
Also Read : ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం