ఉద్యోగం కోసం యువతి నిరసన

ఓయూ, వెలుగు : పీహెచ్​డీ పూర్తి చేసిన తనకు ఓయూ అధికారులు ఉద్యోగం ఇవ్వాలని పద్మజా అనే యువతి ఓయూ ఎన్​సీసీ గేటు వద్ద బుధవారం రాత్రి నిరసన చేపట్టారు. తాను నిరుపేద ఎస్సీ కులానికి చెందిన మహిళనని,  పీహెచ్​డీ పూర్తి చేసి 11 ఏళ్లు అవుతున్నా తనకు ఇంత వరకు ఓయూ అధికారులు ఉద్యోగం ఇవ్వడం లేదన్నారు.

దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కలిసి పలుమార్లు విన్నవించినా స్పందించలేదన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తనకు ఓయూలో ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు.