- గుంటూరులో సైబర్ స్టాకర్ అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: సోషల్ మీడియాలో యువతుల ఫొటోలు సేకరించి, వాటిని ఏఐ టూల్స్‌తో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న సైబర్ స్టాకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ యువతి(24)కి టెలిగ్రామ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తొలుత ఆమెతో ఫ్రెండ్‌గా మెదిలి ఆ తర్వాత యువతికి సంబంధించిన ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇన్ స్టాగ్రామ్ద్వారా సేకరించాడు. ఆ ఫొటోలను న్యూడ్గామార్ఫింగ్ చేసి కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌కు పంపిస్తానంటూ బెదిరించాడు. దీనిపై బాధితురాలు అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెలిగ్రామ్ ఐడీ ఆధారంగా సైబర్ స్టాకింగ్‌కు పాల్పడింది గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థి రామకృష్ణ(21)గా గుర్తించారు. అతడిని గుంటూరులో అరెస్ట్ చేసి,సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఫోన్లో అనేక మంది యువతులకు చెందిన మార్ఫింగ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు.